UPDATED 27th NOVEMBER 2018 TUESDAY 9:00 PM
పెద్దాపురం: వాకాడ గ్రీన్‌ఫీల్డ్ పాఠశాలలో ఈనెల 25న నిర్వహించిన జిల్లాస్థాయి ఆక్వా కాలిబార్ 2018 స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో పెద్దాపురం శ్రీ ప్రకాష్ సినర్జీ స్కూల్ విద్యార్థులు ఘన విజయం సాధించారు. సుమారు 20 పాఠశాలల నుంచి 200 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ పోటీల్లో శ్రీ ప్రకాష్ సినర్జీ స్కూల్‌లో 8వ తరగతి విద్యార్థి పి. రాజేష్ 50 మీటర్లు, 100 మీటర్లు, 200 మీటర్ల ఫ్రీస్టైల్ విభాగాల్లో ప్రథమ స్థానంలో నిలిచాడు. అలాగే 50 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్ విభాగంలో ప్రథమ స్థానం సాధించాడు. 8వ తరగతి విద్యార్థి కె. దీపక్ 50 మీటర్లు,100 మీటర్లు, బ్రెస్ట్ స్ట్రోక్ విభాగంలో ప్రథమస్థానం, 50 మీటర్లు ఫ్రీస్టైల్ విభాగంలో ద్వితీయస్థానం, 100 మీటర్లు ఫ్రీస్టైల్ విధానంలో 3వ స్థానం సాధించాడు. 7వ తరగతి విద్యార్థి ఎస్. నిఖిల్‌ప్రకాష్ 200 మీటర్ల ఫ్రీస్టైల్ పోటీల్లో ప్రథమస్థానం సాధించాడు. 5వ తరగతి విద్యార్థి కె. శ్రీలయచౌదరి 50 మీటర్లు ఫ్రీస్టైల్‌లో ద్వితీయస్థానం సాధించాడు. వీరిలో పి. రాజేష్, కె. దీపక్, ఎస్. నిఖిల్‌ప్రకాష్ డిసెంబర్ నెల 1,2 తేదీల్లో విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి సబ్ జూనియర్, జూనియర్, ఇంటర్ ఆక్వాటిక్ ఛాంపియన్ షిప్-2018 పోటీలకు ఎంపికయ్యారని వైస్ ప్రిన్సిపాల్ కె. మీరాప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను శ్రీ ప్రకాష్ స్కూల్ డైరక్టర్ సిహెచ్. విజయప్రకాష్, పాఠశాల సివోవో లెఫ్ట్‌నెంట్ కమాండర్ కెఎస్.రావు, వైస్ ప్రిన్సిపాల్ మీరాప్రసాద్, ఉపాధ్యాయులు, తదితరులు అభినందించారు.







