భీమేశ్వరాలయంలో హోంమంత్రి పూజలు

UPDATED 3rd DECEMBER 2018 MONDAY 9:00 PM

సామర్లకోట: శ్రీ చాళుక్య కుమారారామ భీమేశ్వరస్వామి ఆలయంలో కార్తీక మాసం ఆఖరు సోమవారాన్ని పురస్కరించుకుని అశేష రీతిలో భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్దఎత్తున బారులు తీరారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం వేదపండితుల ఆశీర్వచనాలు అందుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ కంటే జగదీష్ మోహన్, సభ్యులు పడాల వీరబాబు, బాడితమాని త్రిమూర్తులు, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, సీనియర్ కౌన్సిలర్ మన్యం చంద్రరావు, దేవస్థానం ఈవో పులి నారాయణమూర్తి, పెద్దాపురం సిఐ యువకుమార్, సామర్లకోట ఎస్ఐ ఎల్. శ్రీనివాసనాయక్, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us