జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడిఉంది

UPDATED 22nd AUGUST 2017 TUESDAY 3:00 PM

పెద్దాపురం: ప్రభుత్వపరంగా జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడిఉందని రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. స్థానిక శ్రీ ప్రకాష్ సినర్జీ స్కూల్లో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా పెద్దాపురం నియోజకవర్గ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రాకుర్తి రాంబాబు అధ్యక్షతన మంగళవారం జరిగింది. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన హోం మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు జర్నలిస్టుల సంక్షేమానికే కృషి చేస్తున్నారని తెలిపారు. జర్నలిస్టుల హక్కులు అడిగే బాధ్యత యూనియన్లకు ఉందని, ప్రజాసమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమన్నారు. జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ పాలసీలు, బస్ పాస్ లు అందచేస్తున్నామని అలాగే త్వరలో గృహాల నిర్మాణానికి ముఖ్యమంత్రి సుముఖత వ్యక్తం చేశారని పేర్కొన్నారు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులపై చర్యలు తీసుకునేందుకు హైపవర్ కమిటీని ఏర్పాటు చేశామని, నకిలీ విలేఖరులు, తప్పుడు కథనాలపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు మాట్లాడుతూ జర్నలిస్టు లందరూ సంఘటితంగా కలిసి పనిచేయాలని, ప్రజల్లో అవగాహన కల్పించి సమస్యలను పరిష్కరించడంలో అధికారులు, ప్రజా ప్రతినిధులకు తోడ్పాటునందించాలన్నారు. ప్రెస్ క్లబ్ భవన్ నిర్మాణానికి హోం మంత్రి సమక్షంలో స్థలాన్ని కేటాయిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అనంతరం ఏపీయూడబ్ల్యూజె రాష్ట్ర ఉపాధ్యక్షుడు మండేలా శ్రీరామమూర్తి, జిల్లా అధ్యక్షుడు కె. స్వాతి ప్రసాద్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అంజిబాబు, కార్యదర్శి సుంకర ప్రసాద్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కాతా సత్యనారాయణ, జిల్లా సంయుక్త కార్యదర్శి మాసా చంద్రరావు (చందు), ఎగ్జిక్యూటివ్ మెంబర్ వీరభద్ర వర్మ మాట్లాడుతూ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. అనంతరం పెద్దాపురం నియోజకవర్గ ప్రెస్ క్లబ్ గౌరవాధ్యక్షుడిగా అడపా వెంకటరావు, అధ్యక్షుడిగా బూరాడ శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడిగా కె. రామ్ ప్రసాద్, కార్యదర్శిగా ఆర్. వి. రమణమూర్తి, కోశాధికారిగా బద్ది కుమార్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా సుధాకర్, సహాయ కార్యదర్శిగా వినాయక్, సభ్యులుగా ఆలీ, సిద్దు, సుబ్రహ్మణ్యం, వెంకట్, ఆనంద్ లు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి గుడాల రమేష్, పెద్దాపురం, సామర్లకోట జెడ్పిటిసిలు సుందరపల్లి శివనాగరాజు, గుమ్మళ్ళ విజయలక్ష్మి, మండల టిడిపి అధ్యక్షుడు కొత్తెం వెంకట శ్రీనివాసరావు (కోటి), మన్యం చంద్రరావు, తిరుపతి సర్పంచ్ మెయిళ్ల కృష్ణమూర్తి, పెద్దాపురం డివిజన్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, అధిక సంఖ్యలో విలేఖరులు పాల్గొన్నారు.       

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us