* ఓఎన్జీసి విజిలెన్స్ విభాగం చీఫ్ జనరల్ మేనేజర్ బి. బాలసుబ్రహ్మణ్యం
* గైట్ లో ఇంటెగ్రేటి క్లబ్ ప్రారంభం
UPDATED 31st OCTOBER 2018 WEDNESDAY 5:30 PM
రాజానగరం: గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (గైట్) కళాశాల డిఎంఎస్ విభాగం ఆధ్వర్యంలో ఓఎన్జీసీ సంస్థ విజిలెన్స్ అవగాహనా వారోత్సవాలపై అవగాహన, గైట్-ఓఎన్జీసీ సంయుక్తంగా విద్యార్థులచే ఏర్పాటు చేసిన ఇంటెగ్రేటి క్లబ్ ప్రారంభోత్సవ కార్యక్రమాలు బుధవారం ఘనంగా నిర్వహించారు. గైట్ డిఎంఎస్ డైరెక్టర్ డాక్టర్ పి.ఆర్.కె. రాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఓఎన్జీసి విజిలెన్స్ ఇంచార్జ్ డిజిఎం ఎస్. సురేష్ కుమార్ మాట్లాడుతూ అవినీతి నిర్మూలనపై విద్యార్థుల్లో చైతన్యం మరింత పెంపొందించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. విజిలెన్స్ అవగాహనా వారోత్సవాలను గత కొన్ని సంవత్సరాలుగా ప్రతీ సంవత్సరం గైట్ కళాశాలలో తాము నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా అవినీతి నిర్మూలనపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. గైట్ డిఎంఎస్ డైరెక్టర్ డాక్టర్ పి.ఆర్.కె. రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో తొలిసారిగా గైట్ కళాశాలలో ఇంటెగ్రేటి క్లబ్ ఏర్పాటు చేశామని, గైట్ ప్రాంగణంలోని కళాశాలల విద్యార్థులు ఇందులో సభ్యులుగా ఉంటారని తెలిపారు. సమాజంలో ఉన్నత విలువలు, జీవన నైపుణ్యాలు పెంపొందించేందుకు ఇంటెగ్రేటి క్లబ్ కృషి చేస్తుందని, జాతీయ సమైక్యతా దినోత్సవం రోజున దీనిని ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా చైతన్య విద్యా సంస్థల చైర్మన్ కె.వి.వి. సత్యనారాయణ రాజు( చైతన్య రాజు) అభినందన సందేశం వివరించారు. ఓఎన్జీసి విజిలెన్స్ విభాగం చీఫ్ జనరల్ మేనేజర్ బి. బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ దేశ ఆర్ధిక, రాజకీయ,సామాజిక అభివృద్ధికి ప్రధాన అవరోధాలలో అవినీతి ఒకటని, అవినీతి నిర్మూలనకు ప్రభుత్వంతో పాటు ప్రజలు, దేశ భవిష్యత్ నిర్ణేతలైన యువత భాద్యత వహించాలని కోరారు. ప్రతీ ఒక్కరూ నీతి, నిజాయితీలతో వ్యవహరించాలని సూచించారు. దేశ సమగ్రత కాపాడడంలో కూడా యువతకు గురుతర భాద్యత ఉందని చెప్పారు. గైట్ అటానమస్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.వి. ప్రసాద్, గైట్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.ఎస్.ఎన్. రాజు ఇంటెగ్రేటి క్లబ్ లోగోను ఆవిష్కరించారు. అభివృద్ధికి అవినీతి ఆటంకమని, నిజాయితీ న్యాయవర్తనతో ఉన్నత ప్రమాణాలను సాధించేందుకు ప్రతీ ఒక్కరూ తమ వంతు భాద్యత నిర్వర్తించాలని, అవినీతి వ్యతిరేక పోరాటానికి మద్దత్తుగా నిలవాలని కోరారు. అనంతరం విద్యార్థినీ, విద్యార్థులకు తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో eradicate corruption-build a new India అనే అంశంపై వకృత్వ, వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఓఎన్జీసి హెచ్ఆర్ చీఫ్ జనరల్ మేనేజర్ కె.వి. భగవాన్, ఎంబీఏ విద్యార్థినీ, విద్యార్థులు, అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.







