మోక్షగుండం సేవలు మరువలేనివి

UPDATED 15th SEPTEMBER 2019 SUNDAY 8:00 PM

గండేపల్లి(రెడ్ బీ న్యూస్): భారతరత్నసర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య దేశానికి అందించిన సేవలు మరువలేనివని, ప్రతీ ఒక్క ఇంజినీరు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి పేర్కొన్నారు. గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యా సంస్థల ప్రాంగణంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఇంజనీర్స్ దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి సతీష్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజాభివృద్ధిలో ఇంజినీర్ల పాత ఎంతో కీలకమైనదని, విద్యార్థులు నిరంతర కృషి, సాధన వల్లే ఉన్నత శిఖరాలకు చేరుకోగలరని అన్నారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదినం పురస్కరించుకుని ఆదిత్య గ్రూప్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలలు సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 13,14 తేదీలలో నిర్వహించిన వేద2కె19 విజయవంతంగా ముగిసిందని, ఈ కార్యక్రమం విజయవంతానికి కృషి చేసిన ప్రతీ ఒక్కరికీ అభినందనలు తెలిపారు. జాతీయస్థాయిలో నిర్వహించిన వేద విజ్ఞాన కాంతులు వెదజల్లుతూ సంతృప్తికరంగా ముగిసిందని ఈ సందర్భంగా ప్రిన్సిపాల్స్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, డాక్టర్ ఆదిరెడ్డి రమేష్, వేద కోఆర్డినేటర్ డాక్టర్ వి. శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపాల్స్, వివిధ విభాగాధిపతులు, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us