UPDATED 12th JANUARY 2018 FRIDAY 5:00 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల ఎన్.ఎస్.ఎస్ బృందం మండలంలోని యర్రంపాలెం గ్రామంలో ఏడు రోజులు క్యాంప్ నిర్వహించి పలు సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ కళాశాల ఎన్.ఎస్.ఎస్. బృందం గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహించి పరిసరాల పరిశుభ్రత, కలుషిత ఆహరం, నీరు, బహిరంగ మలవిసర్జన వల్ల కలిగే నష్టాలు, వ్యక్తిగత మరుగుదొడ్లు ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించారన్నారు. ప్రభుత్వ పాఠశాలకు రూ.11 వేలతో గేట్ నిర్మించి, విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, ఆటవస్తువులు పంపిణి చేశామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్.ఎస్.ఎస్. కో-ఆర్డినేటర్లు పి. శివకుమార్, ఆర్. జ్ఞానావర్ధన్, జె.డి. వెంకటేష్, విద్యార్థులు పాల్గొన్నారు.







