ప్రగతిలో జాతీయస్థాయి సాంకేతిక సదస్సు ప్రారంభం

UPDATED 7th DECEMBER 2018 FRIDAY 7:00 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలలో స్ట్రిడ్స్ 2కె18లో భాగంగా కళాశాల కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో ఎప్రోజిన్ 2కె18 పేరిట ఒకరోజు జాతీయ సదస్సు శుక్రవారం నిర్వహించారు. ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల ఛైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు, జెఎన్టీయు(విజయనగరం) కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ టి. శివరామకృష్ణ, ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. రమాశ్రీ, ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శంభూప్రసాద్ చేతుల మీదుగా ఎప్రోజిన్ టెక్నికల్ సావనీరును విడుదల చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు మాట్లాడుతూ ఈ కార్యక్రమం విద్యార్థులకు ఎన్నో అవకాశాలను అందిస్తుందని, అలాగే విద్యార్థులు తమ నైపుణ్యాలను ప్రదర్శించి, భవిష్యత్తులో టెక్నికల్ విద్యలో అత్యంత శక్తివంతమైన ఇంజనీర్లుగా ఎదగాలని అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శంభుప్రసాద్ మాట్లాడుతూ తమ కళాశాలలో కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ  విద్యార్థుల కోసం నార్త్ ఈస్టర్న్యూనివర్శిటీ (బోస్టన్), ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్ మెంట్ కార్పోరేషన్ తో కలిసి ప్రగతి ఎంట్రప్రెన్యూర్ షిప్ క్లబ్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మొత్తం వివిధ అంశాలలో 40 పేపర్ ప్రెజంటేషన్లు, 40 పవర్ పాయింట్ ప్రెజంటేషన్లు, 30 పోస్టర్ ప్రెజంటేషన్లు, 26 ప్రోజెక్ట్ ఎక్సపోలు, 26 యాప్ ఎక్సపోలు, 64 టెక్నికల్ క్విజ్ టీములు, 78 కోడింగ్ టీములు, మిషన్ లెర్నింగ్ ఛాలెంజ్ లలో విద్యార్థులు పాల్గొన్నారని కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాధిపతులు డాక్టర్ ఎం. రాధికామణి, డి. శిరీష తెలిపారు. ఈ కార్యక్రమానికి అతిధులుగా హాజరైన టి. శివరామకృష్ణ, డాక్టర్ ఎస్. రమాశ్రీలు న్యాయనిర్ణేతలుగా, కోఆర్డినేటర్లుగా స్ట్రిడ్స్ 2కె18 కన్వీనర్, సివిల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ బి. సుభాన్ రామ్ జీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ జి. సూర్యకళాఈశ్వరి, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కె. అరుణ్ మణికుమార్ వ్యవహించారు. ఈ కార్యక్రమంలో డైరక్టర్ మేనేజ్ మెంట్ ఎం.వి. హరనాథబాబు, డైరక్టర్ డాక్టర్ జి. రఘురాం, వైస్ ప్రెసిడెంట్ ఎమ్. సతీష్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. సత్యనారాయణ, డీన్-అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ జి. నరేష్, వివిధ విభాగాల అధిపతులు, సీనియర్ అధ్యాపకులు, కళాశాల సిబ్బంది, విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us