అధికార వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి

UPDATED 6th FEBRUARY 2020 THURSDAY 9:00 PM

సామర్లకోట(రెడ్ బీ న్యూస్): అధికార వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యపడుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు పేర్కొన్నారు. మూడు రాజధానులు ముద్దు అనే నినాదంతో నియోజకవర్గ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు కరణం భాను ఆధ్వర్యంలో పట్టణంలోని వివిధ కళాశాలలకు చెందిన విద్యార్ధినీ, విద్యార్థులు స్థానిక మెహర్ కాంప్లెక్స్ నుంచి శుక్రవారం భారీ ర్యాలీ ప్రారంభించారు. అనంతరం స్టేషన్ సెంటరుకు చేరుకొని అక్కడ  మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా దొరబాబు మాట్లాడుతూ రాష్ట్రాన్ని మూడు రాజధానులు చేయడం వల్ల వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ అడుగులు వేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి వెంకట అప్పారావు చౌదరి, కార్మిక నాయకులు దవులూరి సుబ్బారావు, పార్టీ నాయకులు ఆవాల లక్ష్మీనారాయణ, కాళ్ల లక్ష్మీనారాయణ, సేపేని సురేష్, యార్లగడ్డ జగదీష్, మద్దాల శ్రీను, నేతల హరిబాబు, పాగా సురేష్ కుమార్, ఊబా జాన్ మోజస్, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు..

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us