UPDATED 1st MAY 2018 TUESDAY 7:30 PM
రంపచోడవరం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎస్.టి కార్పోరేషన్, సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ షెడ్యూల్డు తెగల సహకార ఆర్థికాభివృద్ధి సంస్థ (ట్రైకార్) ద్వారా 2018-19 ఆర్థిక సంవత్సరం గిరిజన అభ్యర్ధుల నుంచి సబ్సిడీతో కూడిన వ్యక్తిగత రుణాలు మంజూరుకై దరఖాస్తుల ఆన్ లైన్ గడువును మే నెల10వ తేదీ వరకు పొడిగించినట్లు ఐటిడిఎ పివో నిషాంత్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గిరిజన అభ్యర్డులు అందరూ ఈ విషయాన్ని గుర్తించి మే 10 తేదీవరకు ఆన్ లైన్ బెనిఫిషరీ మేనేజ్ మెంట్, మోనటరింగ్ సిస్టమ్ (ఒబిఎంఎంఎస్) ద్వారా తమ దరఖాస్తులను ఆన్ లైన్ చేసుకోవచ్చన్నారు. ఆన్ లైన్ లో నమోదు కాని గిరిజన అభ్యర్థులు రుణాలు పొందుటకు అర్హులు కారన్నారు. నిరుద్యోగ గిరిజన యువతీ, యువకులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్ధికంగా బలోపేతమై మెరుగైన జీవనాన్ని గడపాలని ఆయన విజ్ఞప్తి జేశారు.







