బాణాసంచా తయారీ కేంద్రాలు నిబంధనలు పాటించాలి

UPDATED 8th SEPTEMBER 2018 SATURDAY 9:00 PM

సామర్లకోట: బాణాసంచా తయారీ కేంద్రాల నిర్వాహకులు నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని సిఐ వై.ఆర్.కె. శ్రీనివాస్ తెలిపారు. పెద్దాపురం డిఎస్పీ చిలకా వెంకట రామారావు ఆదేశాల మేరకు మండలంలోని హుస్సేన్ పురం, వేట్లపాలెం గ్రామాల్లో గల బాణసంచా తయారీ కేంద్రాలను సిఐ రెవెన్యూ, అగ్నిమాపక శాఖల అధికారులతో కలిసి శనివారం తనిఖీ చేసి రక్షణ చర్యలు పరిశీలించారు. ఏదైనా ప్రమాదం జరిగిన సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి నిర్వాహకులకు సూచించారు. లైసెన్సు లేకుండా నిబంధనలు ఉల్లంఘించి బాణాసంచా తయారుచేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం అగ్నిమాపకాధికారి బంగారపు ఏసుబాబు, ఎస్ఐ ఎల్. శ్రీనివాసనాయక్, ఆర్.ఐ ఎమ్. రాజేష్, విఆర్వో ఎం.డి.కె. వల్లి, తదితరులు పాల్గొన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us