UPDATED 8th JANUARY 2019 TUESDAY 7:00 PM
పెద్దాపురం: గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో పెద్దాపురం మండలం ఆనూరు గ్రామంలో గల పాఠశాల విద్యార్థులకు అగ్ని ప్రమాదాల నివారణ, జాగ్రత్త చర్యలపై మంగళవారం అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్నిప్రమాదం జరిగినప్పుడు ప్రమాదంలో ఉన్న వ్యక్తులను ఎలా రక్షించాలని, ఆ సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మంటలు వ్యాపించకుండా ఎలా చూడాలి, ప్రమాద సమయంలో రక్షించేవారు ఎటువంటి దుస్తులు ధరించాలి, ఎటువంటి పరికరాలు వినియోగించాలి వంటి అనేక అంశాలపై విద్యార్థులకు సామర్లకోట ర్యాక్ సిరామిక్స్ ఎన్విరాన్ మెంట్ అండ్ హెల్త్ సేఫ్టీ విభాగాధిపతి ఎంఎస్ఆర్ గోపాల్ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ర్యాక్ సిరామిక్స్ సిఆర్ ఎగ్జిక్యూటివ్ ఎ. కృష్ణనారాయణ, మండల పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నాగభూషణం, పి.రాజశేఖర ఫణీంద్ర, అజయ్ కిరీటీ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.







