ఆనూరులో ముగిసిన ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం

UPDATED 10th JANUARY 2019 THURSDAY 9:00 PM

పెద్దాపురం: మండల పరిధిలోని ఆనూరు గ్రామంలో గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 4 నుంచి 10వ తేదీ వరకు వారం రోజులపాటు నిర్వహించిన ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం గురువారం ముగిసింది. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ పి.రాజశేఖర ఫణీంద్ర మాట్లాడుతూ వారంరోజుల పాటు నిర్వహించిన ఈ ప్రత్యేక శిబిరంలో వృద్ధాప్య పింఛన్లు, ఆరోగ్యం, నిరుద్యోగం, ఆహార విలువలు, బిందు సేద్యం, అగ్ని ప్రమాదాల నివారణ, మానవతా విలువలు, స్వచ్చభారత్ వంటి అనేక విషయాలపై గ్రామస్థులకు అవగాహన కల్పించామని, అలాగే పాఠశాల విద్యార్థులకు వివిధ క్రీడా పోటీలు నిర్వహించామని తెలిపారు. అనంతరం క్రీడాపోటీల్లో  గెలుపొందిన విజేతలకు బహుమతులు అందచేశారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగభూషణం, బి. సుధీర్, అజయ్ కిరీటి, కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఫ్యాకల్టీ ఇన్ ఛార్జ్ లు ఆర్.ఎస్.కె. సుప్రీత, కె. పవన్ కుమార్, వి. రవి వీరచౌదరి, వాలంటీర్లు సంజీవ్, ప్రమోద్, జయకాంత్, చైతన్య తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us