UPDATED 23rd APRIL 2018 TUESDAY 10:00 PM
సామర్లకోట: జాతీయస్థాయిలో స్వచ్ఛత ఎక్సలెన్సీ అవార్డును అందుకున్న మెప్మా సభ్యులను మునిసిపల్ కమీషనర్ సి.హెచ్. వెంకటేశ్వరరావు మంగళవారం అభినందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ స్వచ్ఛభారత్ కార్యక్రమాలు అమలు చేయడంలో మరింత ఉత్సాహంతో ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ ఆకుల అనంతలక్ష్మి, సెక్రటరీ ఆకుల సూర్యావతి, ట్రెజరర్ మాదాబత్తుల తరంగిణి. ఆర్.పి.ఎం. శైలజ, సిడిపివో ఎం. సుజాత, టిఎంసి కె. సుధాకరరావు, కమ్యూనిటీ ఆర్గనైజర్ పి. వెంకటలక్ష్మి, కె. సుధారాణి, పి. శైలజ, పాల్గొన్నారు. వీరిని అభినందించిన వారిలో మున్సిపల్ డిఇ ప్రభాకర్, కె.డబ్యు. జయకర్ తదితరులు ఉన్నారు.







