UPDATED 4th JULY 2018 WEDNESDAY 9:00 PM
రాజానగరం: గైట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిభా పురస్కార గ్రహీత కోటమశెట్టిన. ఎ.వెంకట శివకుమార్ ను చైతన్యా విద్యా సంస్థల చైర్మన్ కె.వి.వి. సత్యనారాయణ రాజు (చైతన్య రాజు), గైట్ మేనేజింగ్ డైరెక్టర్ కె. శశికిరణ్ వర్మ అభినందించారు. గైట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.ఎం.ఎం.ఎస్. శర్మ అధ్యక్షతన జరిగిన సభలో చైతన్య రాజు మాట్లాడుతూ విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం నైపుణ్య శిక్షణాభివృద్ధి శిక్షణ అందిస్తుందని, దీనిని దృష్టి సారించి ఈ శిక్షణలను సద్వినియోగం చేసుకుని ప్రయోజనం పొందాలన్నారు. గైట్ ఎండి శశికిరణ్ వర్మ మాట్లాడుతూ విద్యార్థులు అభ్యున్నతకి అవసరమైన పూర్తి సహాయ సహకారాలు కళాశాల అందిస్తుందని, ప్రస్తుత పోటీ ప్రపంచాన్ని దృష్టిలో ఉంచుకుని దీనిని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు అవసరమైన నైపుణ్యాలను విద్యార్థులు పెంపొందించుకోవాలని సూచించారు. అనంతరం కళాశాల తరఫున ట్యాబ్ ను బహుమతిగా అందచేశారు. ఈ కార్యక్రమంలో గైట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె. లక్ష్మిశశివర్మ, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శ్రీగౌరీరెడ్డి, జనరల్ మేనేజర్ డాక్టర్ పి. సుబ్బరాజు, ఇసిఇ విభాగాధిపతి బి. జగదీష్, తదితరులు పాల్గొన్నారు.







