UPDATED 8th SEPTEMBER 2017 FRIDAY 7:00 PM
గండేపల్లి: విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఆదిత్య విద్యా సంస్థలు కృషి చేస్తున్నట్లు సంస్థ వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల క్యాంపస్ లో బెంగుళూరుకు చెందిన ప్రముఖ శిక్షణా సంస్థ SAPతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన తెలిపారు. వివిధ ఎస్టిమైడ్ ఆర్గనైజషన్స్ (మైక్రోసాఫ్ట్, సిస్కో) ఎప్పటికప్పుడు విద్యార్థుల విద్యా విషయక స్థాయిలను మెరుగు పరచడానికి, ఉద్యోగ సామర్థ్యం మెరుగుపరిచేందుకు ఎటిటి రూ.లక్ష వసూలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే MNC లతో MOU లను ప్రవేశపెట్టే ప్రక్రియలో ఆదిత్య SAP ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, బెంగుళూరుకు నేరుగా SAP డాంగిల్ సైట్ లైసెన్స్ సెంటర్ ను ఏర్పాటు చేసేందుకు ఆదిత్య క్యాంపస్ లో ప్రత్యేకంగా విద్యాసంస్థల కోసం ప్రత్యేక ఒప్పందం చేసుకోవడం జరిగిందన్నారు. విద్యార్థి ఉపాధి నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు ఉత్తమ ప్యాకేజీతో CMM లెవెల్ కంపెనీల్లో ఉద్యోగాలు పొందడానికి ఎంతో ఉపయోగపడుతుంద న్నారు. అనేక బహుళజాతి కంపెనీల్లో తమ కళాశాలలో చదివిన విద్యార్థులు పని చేస్తున్నారన్నారు. అనంతరం సంస్థ వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి, జోయిస్ ప్రియ పరస్పరం ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం. శ్రీనివాసరెడ్డి, డాక్టర్ టి.కె.రామ కృష్ణారావు, ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, టెక్నికల్ హబ్ అధికారి నీలం బాబ్జి, బద్రి నారాయణ, తదితరులు పాల్గొన్నారు.







