UPDATED 15th JULY 2019 MONDAY 7:00 PM
పెద్దాపురం: గ్రామ వాలంటీర్ల నియామకాన్ని ఎక్కడా విమర్శలకు తావులేకుండా పక్కాగా, పారదర్శకంగా చేపట్టనున్నట్లు తహసీల్దార్ కోనాడ పద్మావతి తెలిపారు. సోమవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో చదలాడ, జె. తిమ్మాపురం, ఆర్.బి. కొత్తూరు, తాటిపర్తి గ్రామాలకు చెందిన 120 మంది అభ్యర్థులు గ్రామ వాలంటీర్ల ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అబ్బిరెడ్డి రమణారెడ్డి, ఎంఏవో కొల్లి ద్వారకాదేవి, ఈవోపీఆర్డీ కరక హిమమహేశ్వరి, మండల ఇంజనీర్ అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.







