UPDATED 11th SEPTEMBER 2018 TUESDAY 9:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజినీరింగ్ క్యాంపస్ లో గల హాస్టల్ విద్యార్థులకు ప్రతీ ఏటా నిర్వహించే ఆదిత్య ప్రీమియర్ లీగ్ పేరిట క్రికెట్ పోటీలు, ఆదిత్య ఫుట్ బాల్ లీగ్ పేరిట ఫుట్ బాల్ పోటీలను మంగళవారం ఘనంగా ప్రారంభించారు. ఈ పోటీలను క్యాంపస్ లో గల వివిధ కళాశాలల ప్రిన్సిపాల్స్ పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు మాట్లాడుతూ క్రీడలు విద్యార్థి మానసిక శారీరక వికాసానికి దోహదం చేస్తాయని, క్రమశిక్షణ, పట్టుదల, స్నేహభావానికి ఆటలు ఉపయోగపడతాయని అన్నారు. విద్యార్థులకు పోటీ తత్వాన్ని పెంపొందించేందుకు ఆదిత్య ప్రతి ఏటా నిర్వహించే ఈ పోటీలు స్నేహపూర్వక వాతావరణంలో విజయవంతంగా సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ డాక్టర్ ఆదిరెడ్డి రమేష్, డాక్టర్ ఆస్థాశర్మ, జి.వి. రామకృష్ణ, కోకో-కోలా కంపెనీ ప్రతినిధులు, హాస్టల్ చీఫ్ వార్డెన్స్, ఫిజికల్ డైరెక్టర్లు, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.







