UPDATED 26th NOVEMBER 2018 MONDAY 10:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం ఆదిత్య ఇంజనీరింగ్ క్యాంపస్ డైరెక్టర్, ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి, వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి, ప్రిన్సిపాల్స్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, డాక్టర్ ఆదిరెడ్డి రమేష్, వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ వల్లెం శ్రీనివాసరావు, డాక్టర్ ఎస్. రమాశ్రీ, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలియచేశారు. తన పుట్టినరోజు సందర్బంగా డాక్టర్ శ్రీనివాసరెడ్డి ఆదిత్య ప్రాంగణంలో మొక్కను నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతీ పుట్టినరోజుకు గత 18 సంవత్సరాలుగా మొక్కను నాటుతున్నానని, ఈ విధంగా మనం ఆచరిస్తూ ఇతరులను ఆచరించమని చెప్పేందుకు అర్హత పొందుతామని, ఎన్ఎస్ఎస్ ద్వారా విరివిగా మొక్కలు నాటించి పర్యావరణాన్ని కాపాడాలని గ్రామాల్లో ప్రజలను అవహగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ విధంగా పుట్టినరోజు నాడు మొక్కలు నాటడం ఎంతో సంతృప్తిగా ఉందని, శుభాకాంక్షలు తెల్పిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియచేశారు.







