UPDATED 2nd APRIL 2018 MONDAY 7:00 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య కాలేజ్ అఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ కళాశాలలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ స్టూడెంట్ విభాగం సోమవారం ప్రారంభించినట్లు ఆదిత్య విద్యాసంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైదరాబాద్ కు చెందిన డా.ఎస్. లక్ష్మీ నారాయణ (ఐఈఈఈ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్, హైదరాబాద్ సెక్షన్), కె.వి. శ్రీరామ్ (ఐఈఈఈ కమిటీ వైస్ చైర్మన్- వైజాగ్ సెక్షన్) పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు సోషల్ నెట్ వర్క్, టెక్స్ట్ ఇంటెలిజెంట్ తదితర అంశాలతో పాటు విద్యార్థికి ఐఈఈఈ స్టూడెంట్స్ విభాగం సభ్యత్వం వల్ల కలిగే ఉపయోగాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎ. రామకృష్ణారావు, వివిధ విభాగాధిపతులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.







