అమరావతి వెళ్లకుండా పోలీసులు అడ్డుకట్ట

UPDATED 19th JANUARY 2020 SUNDAY 10:00 PM

పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు సోమవారం అసెంబ్లీని ముట్టడించడానికి బయల్దేరనున్న తెలుగుదేశం పార్టీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మూడు రాజధానులను ప్రతిపాదించగా సోమవారంనాడు అమరావతిలో జరిగే కేబినెట్‌, అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశంపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు ఆదివారం రాత్రి అమరావతికి బయల్దేరడానికి సిద్ధమవుతుండగా స్థానిక పోలీసులు ఆయనను అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సూరిబాబురాజు మాట్లాడుతూ రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛను తెలుపుతుంటే ముందుగానే అరెస్ట్‌లు చేయడం ప్రజాస్వామ్యంలో ప్రాథమిక హక్కులను కాలరాయడమేనని ఆయన అన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us