అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా మెలగాలి

UPDATED 14th APRIL 2018 SATURDAY 6:00 PM

సామర్లకోట: భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అందరూ మెలగాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి  నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. స్థానిక పెన్షన్ లైన్ లో జైభీమ్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 127వ జయంతి ఉత్సవాలలో శనివారం మంత్రి పాల్గొని అంబేథ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి, అనంతరం 127వ జయంతి కేక్ ను కట్ చేశారు. ఈ సందర్బంగా మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ అంబేద్కర్ ఆలోచనా విధానమే ఈ దేశానికి శరణ్యమని, భారత రాజ్యాంగ రచనలో కీలకపాత్ర వహించిన వ్యక్తి అని అన్నారు. దేశమంతటా ఈ రోజు అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటారని అన్నారు. త్వరలో రాష్ట్ర రాజధాని అమరావతిలో 120 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం దళితులను అన్ని రంగాల్లోను ముందుకు తీసుకురావడానికి అంబేద్కర్ చూపిన మార్గాల ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. విద్యాపరంగాను, మౌళిక సదుపాయాలలో, రిజర్వేషన్లలోను, సంక్షేమ పథకాలు అమలు చేయడంలోను దళితులకు ప్రభుత్వం పెద్ద పీట వేసిందని చెప్పారు. పట్టణంలో రూ. 20 లక్షలతో ఎస్.సి కమ్యూనిటీ భవనాన్ని నిర్మిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్రప్రసాద్, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, ఎంపిపి ఆకునూరి సత్తిబాబు, జిల్లా ఎస్.సి, ఎస్.టి విజిలెన్స్ మోనిటరింగ్ సభ్యులు బడుగు శ్రీకాంత్, మన్యం చంద్రరావు, మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులు అందుగుల జార్జి చక్రవర్తి, గుమ్మళ్ళ రామకృష్ణ, మూడవ వార్డు కౌన్సిలర్ పోలిపల్లి హేమావతి, బాబీ, భీమేశ్వర ఆలయ ట్రస్టుబోర్డు చైర్మన్ కంటే బాబు, జైభీమ్ యువజన సంఘ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us