UPDATED 16th MAY 2019 THURSDAY 9:00 PM
సామర్లకోట: జాతీయ డెంగ్యూ వ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సామర్లకోట మున్సిపాలిటీ ఆవరణలో మెప్మా, మున్సిపల్ సిబ్బంది, ఆశా వర్కర్లు ఆధ్వర్యంలో గురువారం అవగాహనా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దోమకాటు ద్వారా వ్యాపించే ప్రమాదకర డెంగ్యూ వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలని, ఈడి అనే దోమ కుట్టడం వల్ల వ్యాపించే ఈ వ్యాధి పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండి, దోమల ఉత్పత్తికి ఆస్కారం లేకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ముఖ్యంగా నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు.







