మహిళలకు ముఖ్యమంత్రి ఆర్థిక భరోసా

UPDATED 3rd FEBRUARY 2019 SUNDAY 9:00 PM

పెద్దాపురం: తెలుగింటి ఆడబిడ్డలకు ఆర్థిక భరోసా కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజలు జేజేలు పలుకుతున్నారని అన్నవరం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడు కందుల విశ్వేశ్వరరావు అన్నారు. పెద్దాపురం మండలం జె. తిమ్మాపురం గ్రామంలో ఆదివారం నిర్వహించిన పసుపు-కుంకుమ, ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని పంపిణీ చేశారు. అనంతరం ఆయన  మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయకత్వంలో చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా టిడిపి ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. మహిళా అభ్యున్నతికి కృషి చేస్తున్న సీఎంకు మహిళలు అండగా నిలవాలని కోరారు. వృద్ధుల కష్టాలు చూసి పింఛన్‌ను రూ.2 వేలకు పెంచిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని అన్నారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపింది తెలుగుదేశం ప్రభుత్వమేనని, ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు 1995 మొదటిసారిగా బాధ్యతలు చేపట్టిన తరవాత వెలుగు పథకాన్ని ప్రారంభించి మహిళల జీవితాల్లో వెలుగులు నింపి అన్న ఎన్టీఆర్‌ ఆశయాలను నెరవేర్చారన్నారు. 2014 ఎన్నికల సందర్భంలో మహిళా సంఘాల సభ్యులందరికీ పసుపు-కుంకుమ కింద మూడు విడతలుగా రూ.10 వేలు వంతున ఇస్తామని చెప్పి ఇచ్చారన్నారు. ప్రస్తుతం ఎవరూ అడగకపోయినా పింఛను మొత్తం రెట్టింపు, పసుపు-కుంకుమ కింద మూడు విడతలుగా రూ.10 వేలు వంతున పంపిణీ చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రజలకు, మహిళలకు మేలు చేయాలనే దృఢసంకల్పంతో ఆదుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి ఎ. సూర్యప్రభావతి, ఇమ్మిణ్ణి సుబ్బారావు, మల్లిపూడి శ్రీరామచంద్రప్రసాద్, యెన్నం రామారావు, రాజు, చౌదరి, వెంకన్నబాబు, తదితరులు పాల్గొన్నారు.      

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us