UPDATED 13th OCTOBER 2022 THURSDAY 01:10 PM
Cobra In Shoe : షూలో దాగి ఉన్న ఓ నాగు పాము ఘటన కర్నాటకలోని జరిగింది. నాగు పాము ఒక్కసారిగా షూ నుంచి పడగ విప్పిన తీరు షాక్‌కు గురి చేస్తోంది. మైసూర్‌లోని ఓ వ్యక్తి షూ తొడుక్కునేందుకు వెళ్లాడు. అయితే ఆ షూలో దాగిన పామును చూసి షాక్ అయ్యాడు. అతను వెంటనే స్నేక్ క్యాచర్‌కు ఫోన్ చేశాడు.
పాములు పట్టేవాడు వచ్చి తన వద్ద ఉన్న హుక్‌తో షూను కదిలించాడు. ఆ సమయంలో షూలో చుట్టుకుని ఉన్న పాము చాలా వేగంగా పడగ విప్పుతూ పైకి లేచింది. ఇదంతా వీడియో తీశారు. ట్విట్టర్‌లో పోస్టు అయిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయింది.







