ఉపాధ్యాయులకు శిక్షణా తరగతులు ప్రారంభం

UPDATED 30th JANUARY 2019 WEDNESDAY  9:00 PM

సామర్లకోట: ఉపాధ్యాయులకు నిర్వహించే రూపాంతర శిక్షణతో విద్యార్థులకు ఎంతగానో దోహదపడుతుందని మండల విద్యాశాఖాధికారి వైవి శివరామకృష్ణయ్య అన్నారు. స్థానిక దుర్గాప్రసాద్ పబ్లిక్ స్కూల్లో మండల, అర్బన్ పరిధిలో గల సబ్జెక్టు టీచర్లకు ఐదు రోజుల పాటు నిర్వహించే శిక్షణా  కార్యక్రమాన్ని ఎంఇవో బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలో ఉపాధ్యాయుల బోధన ఆసక్తికరంగా ఉండేందుకు ప్రభుత్వం రూపాంతర శిక్షణా తరగతులు  నిర్వహిస్తుందని, కేంద్ర ప్రభుత్వం రూపాంతర శిక్షణను అన్ని విధాలా జయప్రదం చేయాలని జిల్లా విద్యాశాఖ ద్వారా ఆదేశించినట్లు తెలిపారు. ఈ శిక్షణా తరగతుల్లో విద్యార్థులకు నైతిక విలువలు, నీతికథలు, గాంధీజీ జీవితం, ఉమ్మడి కుటుంబం, సమాజంలో గౌరవం, బాలల సంఘాలు, పార్లమెంటు నమునా, విద్యార్థులను క్రీడల పట్ల ఆసక్తి కలిగించడం, విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరుకావడం, జనరల్ నాలెడ్జ్, ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు తగిన శిక్షణ, పాఠశాలలో జాతీయస్థాయి, రాష్ట్రస్థాయి వార్తలు పిల్లలతో చదివించడం, తదితర కార్యక్రమాలు గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మండల రిసోర్స్ పర్సన్ రాజు, దుర్గాప్రసాద్ స్కూల్ డైరెక్టర్ సంతోష్, ప్రిన్సిపాల్ మోహన్ కుమార్, ఏవో విజయ్ కుమార్, సీఆర్పీలు, తదితరులు పాల్గొన్నారు..

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us