పంచారామక్షేత్రంలో ఏకాదశ రుద్రాభిషేకాలు

UPDATED 14th APRIL 2018 SATURDAY 9:00 PM

సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పట్టణంలో ప్రసిద్ధ పంచారామ క్షేత్రం బాలాత్రిపుర సుందరీ సమేత శ్రీ చాళుక్య కుమారరామ భీమేశ్వరస్వామి వారి ఆలయంలో మాసశివరాత్రి, శనిత్రయోదశి సందర్భంగా శనివారం మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు ఘనంగా నిర్వహించారు. పురాతన శివాలయాలల్లో ప్రతి మాసశివరాత్రి పర్వదినం నాడు అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణస్వామి దేవస్థానం వేదపండితులు, ఋత్విక్కులు ఆధ్వర్యంలో లోకకళ్యాణార్థం మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అన్నవరం దేవస్థానం కార్యనిర్వహణాధికారి జితేంద్ర,భీమేశ్వరస్వామి దేవస్థానం ఈవో పులి నారాయణమూర్తి,  ట్రస్టుబోర్డు చైర్మన్ కంటే జగదీష్ మోహనరావు, సభ్యులు పడాల వీరబాబు, మహంకాళి వెంకటగణేష్, ఇమ్మంది వెంకటేశ్వరరావు, గొల్లపల్లి కామరాజు, బాడితమాని త్రిమూర్తులు, దూది రాజు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us