ఆదిత్యలో ప్రశాంతంగా కానిస్టేబుల్ వ్రాత పరీక్షలు

UPDATED 8th JANUARY 2019 TUESDAY 6:00 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యా సంస్థల ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించిన కానిస్టేబుల్ వ్రాత పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా ముగిసినట్లు ఆదిత్య క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదిత్య క్యాంపస్ లో గల మూడు ఇంజనీరింగ్ కళాశాలలు, పాలిటెక్నిక్ కళాశాలలు, రెండు ఫార్మసీ కళాశాలలు, ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్ లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, రాష్ట్రవ్యాప్తంగా 6487మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కావలసి ఉండగా 5553మంది అభ్యర్థులు హాజరయ్యారని, 934మంది పరీక్షలకు హాజరు కాలేదని అన్నారు. ఉదయం10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించిన ఈ పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్దాపురం డిఎస్పీ చిలకా వెంకట రామారావు పర్యవేక్షణలో జగ్గంపేట, పెద్దాపురం సిఐలు, గండేపల్లి, రంగంపేట, పెద్దాపురం ఎస్ఐలు, తదితర పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. ఆదిత్య యాజమాన్యం పరీక్ష వ్రాసే అభ్యర్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us