UPDATED 30th JUNE 2018 SATURDAY 9:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం: ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ఎన్ఎస్ఎస్ విద్యార్థులు నూతన సభ్యుల పరిచయ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్ హాజరై మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ అంటే నిస్వార్థమైన సేవా దృక్పథమని, ఇందులో సభ్యులుగా చేరుతున్న నూతన వాలంటీర్లకు శుభాభినందనలు తెలియచేశారు. మనం చేసే సేవా కార్యక్రమాలు భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలవాలని, ఎన్ఎస్ఎస్ లో చేరటం వల్ల విద్యార్థులలో స్నేహభావం, సమాజం పట్ల భాద్యత పెంపొందుతుందని అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రజాహిత కార్యక్రమాలతో ఎన్ఎస్ఎస్ బృందం మంచి పేరు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కో-ఆర్డినేటర్స్ బాలమోహన్, ఎమ్. సోమిరెడ్డి, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు.







