రైతాంగానికి మెరుగైన సేవలు అందించాలి

UPDATED 25th SEPTEMBER 2018 TUESDAY 6:00 PM

పెద్దాపురం: పశు సంవర్థకశాఖ ద్వారా మెరుగైన సేవలు రైతాంగానికి అందేలా వెటర్నరీ డాక్టర్లు కృషి చేయాలని రెవెన్యూ డివిజనల్ అధికారి ఎన్.ఎస్.వి.బి.వసంతరాయుడు అన్నారు. జిల్లా కలెక్టరు ఆదేశాలు మేరకు స్థానిక ఆర్డీవో  కార్యాలయంలో డివిజన్ పరిధిలోని వెటర్నరీ డాక్టర్లుతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్డీవో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పశుసంవర్థక శాఖ ద్వారా రైతాంగాన్ని అన్నివిధాల ఆదుకొనేందుకు అవసరమైన సౌకర్యాలు, సేవలను వెటర్నరీ డాక్టర్లు వారికి చేరేలా కృషి చేయాలని అన్నారు. పశుసంవర్థక శాఖ ద్వారా నిర్వహిస్తున్న సేవలలో అలసత్వం కలిగిందని జిల్లా కలెక్టరు దృష్టికి వచ్చిందని, దీనిని దృష్టిలో పెట్టుకుని వెటర్నరీ డాక్టర్లు పనిచేయాలని అన్నారు. పశుసంవర్ధక శాఖ ద్వారా నిర్వహిస్తున్న గోకులాలు, మినీగోకులాలు నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని, పశుగ్రాసాలకు సంబందించిన భూమిని గుర్తించి ఎక్కువ పశుగ్రాసాల యూనిట్ ని పెంచాలని ఆయన సూచించారు. అనంతరం మండలాల వారీగా  శాఖాపరమైన ప్రగతి నివేదికను సమీక్షించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ పరిధిలోని వెటర్నరీ డాక్టర్లు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us