UPDATED 30th JANUARY 2019 WEDNESDAY 9:00 PM
సామర్లకోట: జాతిపిత మహాత్మాగాంధీ దేశం కోసం చేసిన సేవలు, త్యాగాలు చిరస్మరణీయమని మున్సిపల్ కమీషనర్ సిహెచ్ వెంకటేశ్వరరావు అన్నారు. మహాత్మాగాంధీ వర్థంతి సందర్భంగా మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న గాంధీజీ విగ్రహానికి మున్సిపల్ సిబ్బందితో కలిసి బుధవారం పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీజీ సేవలను కొనియాడుతూ ఆయన జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అహింసా మార్గంలో అలుపెరగని పోరాటం చేసి పరాయి పాలనలో ఉన్న భారతదేశానికి స్వాతంత్య్రం అందించిన ఘనత మహాత్మాగాంధీకే దక్కుతుందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా గాంధీ మార్గమే హింసలేని సమాజ నిర్మాణానికి నాంది పలుకుతుందని, సమస్యల పరిష్కారానికి కూడా గాంధీయిజమే తోడ్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిఇ సిహెచ్ రామారావు, మేనేజర్ ఎస్. అచ్యుతరాజు, ఆర్ఒ సిహెచ్ వెంకటేశ్వర్లు, టీపిఓ రత్నాకర్, జేఏవో ఎన్.ఎల్. సంగీత, తదితరులు పాల్గొన్నారు.







