గంగవరం (రెడ్ బీ న్యూస్) 9 నవంబర్ 2021: గంగవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఆశ్రమ బాలికోన్నత పాఠశాల, మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల, లూధరన్ ఎయిడెడ్ పాఠశాలల్లో మండల విద్యాశాఖాధికారి వై.మల్లేశ్వరరావు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో రికార్డులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. తరగతి గదిలో పాఠాలు చెప్పే తీరును పరిశీలించారు. విద్యార్థుల్లోని విద్యా ప్రమాణాల స్థాయి పరిశీలించారు. అనంతరం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా సిద్ధం చేసిన వంటలను పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ సక్రమంగా అమలు చేయాలని, పాఠశాలలు పరిసరాలు, వంట షెడ్డు, మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు అప్పారావు, రమణ, రాంబాబు, నాగమణి తదితరులు పాల్గొన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్‌పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







