ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలి

UPDATED 12th MARCH 2020 THURSDAY 9:00 PM

సామర్లకోట(రెడ్ బీ న్యూస్): జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నియమ, నిబంధనలను అనుసరించి నిర్వహించేలా కృషి చేయాలని పీవోలు, ఏపీవోలను ఆదేశించారు. ఎన్నికల నిర్వహణపై మండలంలోని పీవోలు, ఏపీవోలకు స్థానిక సిబిఎం సెంటినరీ ఉన్నత పాఠశాలలో గురువారం శిక్షణా తరగతులు నిర్వహించారు. ఎన్నికలకు సమయం చాలా తక్కువ ఉన్న నేపథ్యంలో ఎన్నికల నియమావళిపై పూర్తి అవగాహన పెంచుకుని విధులు నిర్వహించాలని అన్నారు. ముందుగా పోలింగ్ కేంద్రాల్లో లైటింగ్, వెబ్ కాస్టింగ్, ఫర్నీచర్ వంటి ఏర్పాట్లు పరిశీలించాలని, పోలింగ్ సమయంలో ఎలాంటి అనుమానాస్పద పరిస్థితులు ఎదురైతే వెంటనే సమీపంలో ఉన్న పోలీస్ సిబ్బందికి సమాచారం అందించాలన్నారు. పోలింగ్ ఏజెంట్లను వారికి సంబంధించిన గుర్తింపు కార్డులతో మాత్రమే అనుమతించాలని అన్నారు. అలాగే పోలింగ్ నిర్వహణకు సంబంధించి పలు అంశాలపై వారు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రైనర్లు డి. సీతారాం, ఎం. అర్జున్ కుమార్, ఏ. తాతఅబ్బాయి, ఎం. శ్రీను,  తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us