వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

UPDATED 30th SEPTEMBER 2019 MONDAY 9:00 PM

సామర్లకోట(రెడ్ బీ న్యూస్): వాతావరణంలో మార్పుల వల్ల  వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ సిహెచ్ ధనలక్ష్మి అన్నారు. ఆయుష్మాన్ భారత్ పక్షోత్సవాల్లో భాగంగా వేట్లపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మండల పరిధిలోని మాధవపట్నం గ్రామంలో సోమవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 110 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ధనలక్ష్మి మాట్లాడుతూ వాతావరణంలో మార్పుల వల్ల వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందువల్ల కాచి చల్లార్చిన నీటిని తాగాలని, అలాగే వేడి పదార్థాలు తినాలని ‍అన్నారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ నాగమణి, హెచ్ వి.వి. సత్యవతి, శ్రీనివాస్, ఆశా వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us