నూతన ప్రయోగంలో ఆదిత్య ఫార్మసీ విద్యార్థుల ప్రతిభ

UPDATED 6th DECEMBER 2018 THURSDAY 6:30 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కళాశాల విద్యార్థులు ప్రాజెక్టు వర్కులో భాగంగా చేసిన నూతన ప్రయోగం ఆక్వారంగానికి ఎంతో ఉపయోగపడుతుందని ఫార్మసీ కళాశాలల డైరెక్టర్ డాక్టర్ కె. రవిశంకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ కళాశాల తృతీయ సంవత్సరం బి.ఫార్మసీ విద్యార్థి ఆర్. దేవీ శివకృష్ణ ప్రసాద్, ఫైనల్ ఇయర్ బి. ఫార్మసీ విద్యార్థి పి. అజయ్ కుమార్ సంయుక్తంగా ఆక్సిజన్ ఎవాల్వింగ్ టాబ్లెట్స్ ఫర్ ఆక్వాకల్చర్ అనే నూతన ట్యాబ్లెట్లు రూపొందించారని, ఆక్వారంగంలో వీటిని ఉపయోగించినప్పుడు నీటిలో కరిగిపోకుండా నీటి నుంచి అధిక శాతం ఆక్సిజన్ విడుదల చేస్తుందని, అలాగే ఆక్వా అభివృద్ధికి, రొయ్యల ఎదుగుదలకు సహాయపడుతుందని అన్నారు. 1.5 గ్రాముల టాబ్లెట్ తో 15సిసి ఆక్సిజన్, అలాగే 10గ్రాముల టాబ్లెట్స్ తో 100సిసి ఆక్సిజన్ విడుదల అవుతుందని, ఈ శాస్త్రీయ పరిశోధనతో బయలాజికల్ ఆక్సిలేషన్ డిమాండ్ చాలా వరకు తగ్గుతుందని పేర్కొన్నారు. ఈ ప్రయోగానికి కావలసిన ముఖ్యమైన పరికరాల తోడ్పాటులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (హైదరాబాద్) సహకారం మరువలేనిదని విద్యార్థులు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను డాక్టర్ రవిశంకర్, తదితరులు అభినందించారు.   

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us