UPDATED 3rd MAY 2018 THURSDAY 9:00 PM
సామర్లకోట: జిల్లా గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద శనివారం జరగనున్న శాంతియుత ధర్నా నిమిత్తం సాధారణ సెలవు మంజూరు చేయాలని కోరుతూ తహసీల్దార్ ఎల్.శివకుమార్ కు మండలంలోని విఆర్వోలు గురువారం వినతిపత్రం అందజేశారు. గత నెల 29వ తేదీన విజయవాడలో గ్రామ రెవెన్యూ అధికారుల రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆమోదించిన తీర్మానం, రాష్ట్ర కమిటీ ఆదేశాల ప్రకారం ఈ ధర్నా జరుగుతుందని వారు తెలిపారు.







