UPDATED 22nd JANUARY 2020 WEDNESDAY 9:00 PM
సామర్లకోట(రెడ్ బీ న్యూస్): మాదిగ కార్పోరేషన్ చైర్మన్ కొమ్మూరు కనకారావును జిల్లా మాదిగ సంఘం నాయకులు తాడేపల్లిలోని మాదిగ కార్పోరేషన్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కాపవరపు కుమార్ మాదిగ మాట్లాడుతూ మాదిగ కార్పోరేషన్ కు రూ.10 వేల కోట్లు కేటాయించాలని, మాదిగల కులవృత్తులకు, అలాగే ప్రభుత్వం మాదిగలకు ప్రవేశపెట్టే డప్పు కళాకారుల పింఛన్లు దోపిడీకి గురి అవుతున్నాయని అన్నారు. మాదిగలకు చెందాల్సిన పథకాలు మాదిగలకు చెందేలా చర్యలు తీసుకోవాలని, మాదిగల చరిత్రను నవ వసంతం పుస్తకంలోకి చేర్చి మాదిగల ఔనత్యాన్ని చాటాలని ఆయనను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఎంజేఎస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు విప్పర్తి సుశీల, జిల్లా అధ్యక్షురాలు కాపవరపు సత్యనారాయణమ్మ, ఎంఎంజేఎస్ నాయకులు పిల్లి భూలోకం, మసకపల్లి రాజు, ఆకుమర్తి గణేష్, పేకేటి సారథి, మిర్యాల ఏసేబు, కె. సుధాకర్ బాబు, తదితరులు పాల్గొన్నారు.







