వీరేశ్వరస్వామి ఆలయంలో వైభవంగా దీపోత్సవం

UPDATED 18th NOVEMBER 2017 SATURDAY 9:00 PM

ఐ.పోలవరం: తూర్పుగోదావరి జిల్లా ఐ. పోలవరం మండలం మురమళ్లలోని భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయంలో కార్తీక దీపోత్సవం శనివారం రాత్రి అత్యంత వైభవంగా నిర్వహించారు. మంచుకొండల నడుమ జలపాతంలో ఉన్న మహా శివలింగం, జ్యోతిర్లింగార్చన, త్రిశూలం, పద్మం వంటి ఆకృతులతో లక్ష దీపాలతో సర్వాంగసుందరంగా అలంకరించారు. అధికసంఖ్యలో తరలివచ్చిన భక్తజనంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. ఆలయ మాజీ ఛైర్మన్‌ జంపన బాబు దంపతులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆలయ అసిస్టెంట్ కమీషనర్  ఏపూరి సత్యనారాయణ  ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us