గూగుల్ ఆండ్రాయిడ్ డెవలపర్ ఫండమెంటల్స్ పై వర్క్ షాప్

UPDATED 6th JANUARY 2020 MONDAY 5:30 PM

గండేపల్లి(రెడ్ బీ న్యూస్): గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్&ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాలకు చెందిన తృతీయ సంవత్సరం ఇంజనీరింగ్ విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 6  నుంచి 11వ తేదీ ఆరు రోజులపాటు గూగుల్ ఆండ్రాయిడ్ డెవలపర్ ఫండమెంటల్స్ అనే అంశంపై వర్క్ షాప్ ప్రారంభించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. శ్రీనివాసరెడ్డి తెలిపారు. విద్యార్థులను నూతన శాస్త్ర, సాంకేతిక విషయాల్లో నిష్ణాతులుగా తీర్చిదిద్ధేందుకు, నూతన ఆలోచనలు పెంపొందించేందుకు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ వర్క్ షాప్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ నిపుణులు ఎం. పవన్ కుమార్, పి.ఎస్.వి. కృష్ణ, వరప్రసాద్ శిక్షణ ఇస్తారని, ఇందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు హైదరాబాద్ గూగుల్ సంస్థలో మూడు రోజుల శిక్షణా తరగతులు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల డీన్ (అకడమిక్స్) డాక్టర్ ఎస్. రమాశ్రీ, డీన్ (స్టాట్యూటరీబాడీస్) డాక్టర్ రాయుడు శ్రీనివాస్, విభాగాధిపతులు జి. శ్రీదేవి, వి. సత్యనారాయణ, ఏ. వానతి, ఎం. రాజబాబు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us