స్పందన అర్జీలను సకాలంలో పరిష్కరించాలి

UPDATED 24th JULY 2019 WEDNESDAY 6:30 PM

పెద్దాపురం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతీ సోమవారం నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమంలో నమోదయ్యే అర్జీలను సకాలంలో పరిష్కరించడంలో విఆర్వోలు ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని ఆర్డీవో ఎస్. మల్లిబాబు విఆర్వోలను ఆదేశించారు. పెద్దాపురం ఆర్డీవోగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మల్లిబాబును మండల పరిధిలోని విఆర్వోలు బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందజేశారు. ఈ సందర్భంగా విఆర్వోలను ఉద్దేశించి ఆర్డీవో మల్లిబాబు మాట్లాడుతూ మీ పరిధిలో గల ప్రజా, రెవెన్యూ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ, దేవాదాయ భూములను గుర్తించి నివేదికలను సిద్ధం చేసుకోవాలని అన్నారు. ఏపీఐఐసికి సంబంధించిన భూములు రిపోర్టులోకి రావాలని తెలిపారు. గ్రామాలను తరచూ పర్యటిస్తానని, రెవెన్యూకు సంబంధించిన సమస్యలపై ఎలాంటి  ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని ఆర్డీవో తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ టి. కృష్ణారావు, తదితరులు పాల్గొన్నారు. 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us