UPDATED 9th AUGUST 2018 THURSDAY 9:00 PM
సామర్లకోట: సామర్లకోట రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలోగల జి. మేడపాడు రైల్వే స్టేషన్ కు సమీపంలో రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 40-50 సంవత్సరాలు ఉండడంతో పాటు చామనచాయ రంగుతో ఎత్తు ఐదు అడుగులు పొడవు ఉన్నాడని, అతని వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదన్నారు. కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.







