గైట్ పర్యావరణ పరిరక్షణ పోటీల్లో విజేతలకు బహుమతి ప్రదానం

UPDATED 6th JUNE 2018 WEDNESDAY 9:00 PM

రాజానగరం: పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని గైట్ ఆటానమస్ ఇంజనీరింగ్ కళా శాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.వి. రామ్మూర్తి ఆన్నారు. గైట్ కళాశాలలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గైట్ విద్యా సంస్థలు, అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పులు మంత్రిత్వశాఖ భారత ప్రభుత్వం సౌజన్యంతో విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విజేతలకు బుధవారం బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రామ్మూర్తి  ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్లాస్టిక్ కాలుష్యం నివారిద్దాం అనే అంశంపై భారతదేశం ఈ దినోత్సవాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. కళాశాల సివిల్ విభాగాధిపతి డాక్టర్ డి. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్లాస్టిక్ వ్యర్ధాలు, కాలుష్య నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఒకసారి వాడి వదిలేసే  ప్లాస్టిక్ ఉపకరణాల వల్ల ముప్పు అధికామని, వీటిని పూర్తిగా నిషేధించడం మంచిదని అన్నారు. అనంతరం వ్యాసరచన, వక్తృత్వం పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో గైట్  అటానమస్ కళాశాల అకడమిక్ డీన్ డాక్టర్ ఎం.వి. ప్రసాదరావు, జనరల్ మేనేజర్ డాక్టర్ పి. సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us