UPDATED 3rd JANUARY 2019 THURSDAY 5:30 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యా సంస్థల ప్రాంగణంలో గల గ్రంధాలయ విభాగం ఆధ్వర్యంలో ప్రముఖ సంఘ సంస్కర్త, తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిభాయిపూలే 188వ జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. తొలుత ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ బాలికా విద్యకు సావిత్రిభాయిపూలే నాంది పలికారని, గొప్ప మానవతావాది అయిన పూలే జయంతిని పురస్కరించుకొని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. తమ విద్యా సంస్థలు ప్రగతి పథంలో పయనించడానికి మహిళా ఉపాధ్యాయుల అంకితభావం ప్రశంసనీయమని అన్నారు. అనంతరం మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎస్. రమాశ్రీ, ప్రొఫెసర్ జి. శ్రీదేవి, ప్రొఫెసర్ వానతి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వి. శ్రీనివాసరావు, గ్రంథాలయ అధికారి కె. అశోక్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.







