UPDATED 24th NOVEMBER 2018 SATURDAY 9:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్లో జాతీయస్థాయి టోస్ట్ మాస్టర్స్ కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించినట్లు డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో విద్యార్థినీ, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని, విద్యార్థుల్లోని అంతర్గత నైపుణ్యాలను వెలికితీయడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. సమాజ నిర్మాణానికి అవసరమయ్యే ప్రతిభ, జ్ఞానం సంపాదించి దైనందిక జీవితంలో రాణించడానికి మార్గం సుగమం అవుతుందని విద్యార్థులకు సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి. ఆస్ధాశర్మ మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో పుస్తక పరిజ్ఞానంతో సమానంగా విద్యార్థుల్లోని ప్రత్యేక నైపుణ్యాలను గుర్తించి శిక్షణ ఇవ్వడం ద్వారా వారిని విజేతలుగా తయారు చేయడంలో గురువుల పాత్ర ప్రశంసనీయమని అన్నారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులు దేశంలోని అన్ని ప్రాంతాల విద్యార్థులతో ముఖాముఖి ద్వారా వారి సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ఒక ప్రక్రియను కల్పించవచ్చని సూచించారు. ఈ సందర్భంగా ప్రతిభ ఆధారంగా ఎంపికైన విద్యార్థులను కళాశాల డైరెక్టర్ డాక్టర్ సుగుణారెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ ఆస్ధాశర్మ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు కె. శైలజారావు, అధ్యాపకేతర సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.







