పంటను ఆన్ లైన్ లో నమోదు చేసుకోవాలి

* వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు కె.ఎస్.వి.ప్రసాద్
* నమోదు బాధ్యత సచివాలయ సిబ్బందిదే
* రైతులు వివరాలు తెలియజేస్తే చాలు

UPDATED 3rd JANUARY 2020 FRIDAY 9:00 PM

సామర్లకోట(రెడ్ బీ న్యూస్): ప్రతీ రైతు తాను సాగుచేస్తున్న పంటను ఆన్ లైన్ విధానంలో నమోదు చేయించుకోవాలని వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు కె.ఎస్.వి. ప్రసాద్ అన్నారు. సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో సాగులో ఉన్న రబీ పంట, నీటి వసతులను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేని విధానాన్ని అమలు తెచ్చిందని, ఇందులో భాగంగా రైతులు పంటల బీమా పరిధిలోకి వచ్చేందుకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఈ-కర్షక్‌ యాప్‌ను అమల్లోకి తెచ్చిందని అన్నారు. పంటల బీమా కోసం రైతులు వ్యవసాయాధికారులు, బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చేదని, ఇకపై ఆ అవసరం లేకుండా గ్రామ సచివాలయాలలో ఉన్న వ్యవసాయ, ఉద్యాన, సెరికల్చర్‌ సహాయకులు పంటల సాగు, రైతుల వివరాలను ఈ-కర్షక్‌ యాప్‌లో నమోదు చేస్తారన్నారు. పొలం సర్వే నెంబరు, ఆధార్‌ నెంబరుతో పాటు పొలంలో సాగులో ఉన్న పంటను ఫొటో తీసి ఈ కర్షక్‌ యాప్‌లో నమోదు చేస్తారన్నారు. కౌలు రైతు అయితే భూ యజమానితో కలిసి ఫొటో తీసి అప్‌లోడ్‌ చేస్తారని, భూ యజమాని అంగీకరించకపోతే కౌలు రైతే పంట పొలంలో ఉండి ఫొటో తీయించుకోవాలన్నారు. ప్రతీ రైతూ ఈ కర్షక్‌లో నమోదయ్యేలా గ్రామ సహాయకులు బాధ్యత తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా ఈ-కర్షక్ యాప్ ద్వారా పంట నమోదు ప్రక్రియను సిబ్బందితో ఆన్ లైన్ చేయించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ మాధవరావు మండల వ్యవసాయాధికారిణి ఐ. సత్య, విస్తరణాధికారి ఎం.వి. సతీష్, సచివాలయ సిబ్బంది రామకృష్ణ, వంశీ, నవాజ్, తదితరులు పాల్గొన్నారు.

 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us