అకాలవర్షాలతో వరి పంటకు నష్టం

* మండల వ్యవసాయాధికారిణి ద్వారకాదేవి

UPDATED 25th OCTOBER 2019 FRIDAY 6:30 PM

పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పెద్దాపురం మండలంలో వరి పంట ముంపునకు గురైందని, దీనితో పంటకు నష్టం కలిగే అవకాశం ఉందని మండల వ్యవసాయాధికారిణి కొల్లి  ద్వారకాదేవి అన్నారు. మండల పరిధిలోని కాండ్రకోట గ్రామంలో నీట మునిగిన వరి పంటను శుక్రవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక విలేఖరులతో ఆమె మాట్లాడుతూ పంట కోతకు ముందు, తర్వాత యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా నష్టాన్ని కొంతమేర తగ్గించవచ్చని తెలిపారు. ముందుగా మునిగిన పంట పొలాల్లో నీటిని తీసివేయాలని, ఐదు కేజీల కళ్ళు ఉప్పు 100 లీటర్ల నీటిలో కలిపి కట్టలు కట్టిన పంట కంకులపై పిచికారీ చేస్తే ధాన్యం గింజ మొలకెత్తకుండా, రంగు మారకుండా ఉంటుందని అన్నారు. రైతులందరూ ఈ జాగ్రత్తలు పాటించాలని ఆమె పేర్కొన్నారు.  

 


 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us