ఆదిత్యలో ఘనంగా మానవహక్కుల దినోత్సవం

UPDATED 10th DECEMBER 2018 MONDAY 7:00 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య డిగ్రీ కళాశాలకు చెందిన ఫోరెన్సిక్ ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో మానవహక్కుల దినోత్సవం సందర్భంగా వక్తృత్వ, వ్యాసరచన పోటీలు నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఇ. మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆదిత్య బిజినెస్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు ప్రతీ విషయంపై సరైన అవగాహన, నిర్దిష్టమైన దృక్పధం కలిగి ఉండే విధంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అవసరమని అన్నారు. ఫోరెన్సిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఇ. మోహన్ మాట్లాడుతూ మానవహక్కుల దినోత్సవంపై విద్యార్థులకు సరైన అవగాహన పెంపొందించేందుకు ఈ పోటీలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. 70 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో ప్రతీచోట చట్ట వ్యతిరేక కార్యకలాపాలు న్యాయవ్యవస్థకు సవాలుగా మారాయని, ఇది దేశ అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని విద్యార్థులు తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య బిజినెస్ స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ డి. ఆస్థాశర్మ, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్స్ ఎం. గోవర్ధనరెడ్డి, టి. ప్రవీణ్,  విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us