Young Actress: మోడల్స్‌ని వ్యభిచార ఊబిలోకి దించుతోన్న నటి అరెస్ట్

Updated 22nd April 2023 Saturday 2:20 pm

Young Actress Prostitution: సినిమా ఇండస్ట్రీ అనగానే చాలా మందికి చులకన భావన ఉంటుంది. అందుకు కారణం అక్కడక్కడా జరిగే కొన్ని సంఘటనలే. రీసెంట్‌గా సినిమా అవకాశాల పేరుతో పలువురు అమ్మాయిలను వ్యభిచార ఊబిలోకి దింపుతున్న నటి ఆర్తి మిట్టల్‌ (Aarti Mittal)ను పోలీసులు అరెస్టు చేసినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వార్తలు వచ్చిన కొన్ని గంటలలోనే మరో నటి అడ్డంగా దొరికిపోయింది. ఆ నటి ఎవరో కాదు 24 ఏళ్ల వయసున్న భోజ్‌పురి యంగ్ నటి సుమన్ కుమారి (Bhojpuri Actress Suman Kumari). ముంబై గోరెగావ్‌లోని రాయల్ పామ్ హోటల్‌లో వ్యభిచార (Prostitution) దందా నడుస్తోందన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు దాడులు చేయగా.. ఈ దాడుల్లో సుమన్ కుమారి పోలీసులకు దొరికిపోయింది. ఆమె మధ్యవర్తిగా వ్యవహరిస్తూ.. సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న మోడల్స్‌ని వ్యభిచార ఊబిలోకి దించుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు.

అయితే సుమన్ కుమారిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు సినీ ఫక్కీలో ఓ ఆపరేషన్ (Operation) నడిపినట్లుగా తెలుస్తుంది. ఒక ఫేక్ కస్టమర్‌ని ఆమె వద్దకు పంపి.. బేరాలు సాగిస్తుండగా.. అప్పుడు ఎంటరైన పోలీసులు ఆమెని అదుపులోకి తీసుకుని విచారణ జరపగా.. షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అరెస్ట్‌కు ముందు ఫేక్ కస్టమర్‌తో ఆమె ఒక్కో మోడల్‌కు 50 నుంచి 80 వేల రూపాయల వరకు డిమాండ్ చేసిందని పోలీసులు చెబుతున్నారు. గత ఆరు సంవత్సరాలుగా ముంబైలో నివసిస్తున్న ఆమె.. అవకాశాలు లేక, రాక.. మోడల్స్‌తో ఇలాంటి వ్యవహారాలను నడుపుతున్నట్లుగానూ.. సినిమా అవకాశాలు ఇప్పిస్తామంటూ.. కొందరు మోడల్స్‌ని ఈ ఊబిలోకి దింపుతున్నట్లుగానూ.. ఈ హై ప్రొఫైల్ సెక్స్ రాకెట్ వెనుక పెద్ద ముఠానే ఉన్నట్లుగా పోలీసులు వెల్లడించారు.

అయితే ఈ ముఠాకి సంబంధించిన మెయిన్ పర్సన్స్ మాత్రం తప్పించుకున్నట్లుగా తెలుస్తోంది. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఇక పోలీసులు జరిపిన ఈ దాడిలో భోజ్‌పురి నటి సుమన్ కుమారి (Suman Kumari) అరెస్ట్ కాగా.. ఆమె బారి నుంచి ముగ్గురు మోడల్స్‌ను రక్షించినట్లుగా పోలీసులు వెల్లడించారు. నటి సుమన్ కుమారి విషయానికి వస్తే.. అనేక భోజ్‌పురి సినిమాలు, సాంగ్స్, కామెడీ షోలలో (Comedy Show) ఆమె మెరిసింది. ‘లైలా మజ్ను’ (Laila Majnu), ‘బాప్ నంబ్రి బేటా దస్ నంబ్రి’ (Baap Numbri Beta Dus Numbri) వంటి సినిమాలలో నటించి నటిగా గుర్తింపును పొందింది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us