UPDATED 17th OCTOBER 2019 THURSDAY 9:00 PM
సామర్లకోట(రెడ్ బీ న్యూస్): సామర్లకోట-పెద్దాపురం ఏడిబి రహదారిలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక ర్యాక్ సిరమిక్స్ పరిశ్రమ సమీపంలో రాజమహేంద్రవరం నుంచి కాకినాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు, కాకినాడ నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న పాల వ్యాను వర్షం కారణంగా రోడ్డుకు అడ్డంగా తిరగంతో ఆర్టీసీ బస్సు పాల వ్యానును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు సామర్లకోట ఎస్ఐ సుమంత్ తెలిపారు.







