ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రోత్సవాలు ప్రారంభం

UPDATED 21st SEPTEMBER 2017 THURSDAY 10:00 PM

విజయవాడ:  ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గ అమ్మవారి  హేవలంబి నామసంవత్సర దసరా శరన్నవరాత్రోత్సవాలో భాగంగా తొలిరోజున జగన్మాత స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా గురువారం భక్తులకు దర్శనమిచ్చారు. స్వర్ణశోభితమైన అంతరాలయంలో వేకువజామున మూడు గంటలకు సుప్రభాత సేవ, స్నపనాభిషేకం, అలంకరణ అనంతరం ఉదయం 8.45 గంటలకు భక్తులను దర్శనానికి అనుమతించారు. అలంకరణ పూర్తైన తరువాత ఉత్సవమూర్తి దుర్గమ్మను మేళతాళాలు, మంగళవాయిద్యాల మధ్య అంతరాలయం నుంచి మల్లికార్జున మహామండపం ఆరో అంతస్తుకు తీసుకువచ్చారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి సూర్యకుమారి, పాలకమండలి ఛైర్మన్‌ గౌరంగబాబు, పాలకమండలి సభ్యులతో రుత్వికులు గణపతి పూజ నిర్వహించిన అనంతరం విగ్రహప్రతిష్ఠాపన కార్యక్రమం జరిగింది. మహామండపంలో గురువారం ఉదయం 10 గంటలకు కుంకుమ పూజ ప్రారంభంకాగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సంపూర్ణ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా అమ్మవారిని తొలిరోజు సుమారు 50 వేల మంది దర్శించుకున్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us