UPDATED 29th APRIL 2019 MONDAY 9:00 PM
సామర్లకోట: మేడే పోరాట వారసత్వాన్ని జయప్రదం చేయాలని అంగన్వాడీ కార్యకర్తల సంఘం జిల్లా కార్యదర్శి ఎస్.కె. ఫాతిమా అన్నారు. ఐసిడిఎస్ రూరల్ ప్రాజెక్టు పరిధిలో సీఐటీయూ మండల ప్రధాన కార్యదర్శి టి. నాగమణి అధ్యక్షతన సోమవారం జరిగిన అంగన్వాడీ కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. 1886 ముందు ప్రపంచంలో కార్మికులకు పని గంటలు నియమ, నిబంధనలు, ఉద్యోగ భద్రత, సంక్షేమ కార్యక్రమాలు లేవని, అలాగే సంఘం పెట్టుకొనే హక్కు కూడా లేదని అన్నారు. మేడే పోరాటాల ద్వారా ఈ సమస్యలకు పరిష్కారం లభించిందని అన్నారు. అలాంటి పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని మేడే కార్యక్రమంలో అన్ని సంఘాలు ప్రదర్శనలో పాల్గొవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల ఉపాధ్యక్షులు బాలం శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు







